Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు సంక్షోభంలో రాష్ట్రపతి వేలెట్టలేరు : ప్రెసిడెంట్ రాజ్యాంగ అడ్వైజర్

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంలో రాష్ట్రపతి ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేరని ప్రెసిడెంట్ రాజ్యాంగ సలహాదారు టీకే విశ్వనాథన్ వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి

తమిళనాడు సంక్షోభంలో రాష్ట్రపతి వేలెట్టలేరు : ప్రెసిడెంట్ రాజ్యాంగ అడ్వైజర్
, శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:19 IST)
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంలో రాష్ట్రపతి ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోలేరని ప్రెసిడెంట్ రాజ్యాంగ సలహాదారు టీకే విశ్వనాథన్ వ్యాఖ్యానించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించాయనిగానీ, 356 ఆర్టికల్ ప్రయోగించాలని గానీ కేంద్ర హోం శాఖ లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర గవర్నర్ ఎలాంటి సిఫార్సు చేయలేదని అంటున్నారు. పైగా, ప్రస్తుతం బంతి గవర్నర్ కోర్టులోనే ఉందని అందువల్ల రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశమే లేదని తేల్చి చెపుతున్నారు. 
 
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అన్నాడీఎంకే ఎంపీలు కోరనున్నారు. శశికళను తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించకుండా ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయనున్నారు. దీంతో వారికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కేటాయించి, వారితో భేటీ అయ్యే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్రపతి రాజ్యాంగ సలహాదారి టీకే విశ్వనాథన్ స్పందించారు.
 
తమిళనాట రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రణబ్‌కు ఎలాంటి ప్రమేయం లేదని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు గవర్నర్‌కానీ, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కానీ ప్రణబ్ కు ఫిర్యాదు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇ‍ప్పటివరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే అంశం కూడా తెరపైకి రాలేదని చెప్పారు. అక్కడ ఆపద్ధర్మ సీఎంకు, అన్నాడీఎంకేకు హౌస్‌లో మెజార్టీ బలం ఉందని, ఒకవేళ 356 ఆర్టికల్‌ను విధించాలనే అంశమేమైనా తెరపైకి వస్తే, అప్పుడు ప్రెసిడెంట్ జోక్యం చేసుకుంటారని రాష్ట్రపతి భవన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ గురించి ప్రధాని మోదీకి తెలిసిన అసలు నిజం... ఏంటది?