Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైద్య చరిత్రలో మరో సంచలనం... డయాబెటీస్ టెస్టు కోసం నూతన ఆవష్కరణ

blowing air in a balloon

ఠాగూర్

, గురువారం, 14 మార్చి 2024 (09:31 IST)
వైద్య చరిత్రలో మరో సంచలం ఆవిష్కృతమైంది. బెలూన్‌లోకి గాలిని ఊదడం ద్వారా డయాబెటీస్ టెస్ట్ చేసేలా ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణను రూపొందించారు. పైగా, ఈ యంత్రం ఖర్చు కూడా కేవలం 16 వేల రూపాయలు మాత్రమే. అయితే, ఈ నూతన ఆవిష్కరణను మరిన్ని మార్పులతో త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకుని రానున్నట్టు వారు వెల్లడించారు. 
 
సాధారణంగా శరీరంలో చక్కెర నిల్వ స్థాయిలను తెలుసుకునేందుకు మాటిమాటికి సూదితో గుచ్చి రక్తం తీసుకుని ఆ తర్వాత పరీక్షలు చేసి చక్కెర స్థాయిని నిర్ధారిస్తారు. ఇకపై ఈ సంప్రదాయ పద్ధతులతో పనిలేకుండా సరికొత్త విధానాన్ని దాదాపుగా అందుబాటులోకి తెచ్చారు. శ్వాస ద్వారా తెలుసుకునే బెలూన్లాంటి సరికొత్త పరికరాన్ని హిమాంచల్ ప్రదేశ్ ఐఏటీ మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
ఈ పరికరంలో రోగులు శ్వాసను ఊదితే అది ఆక్సిజన్, బీపీ వివరాలను వెల్లడిస్తుంది. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో ఈ రెండు వివరాలత పాటు అది అడిగే మరికొన్ని వివరాలు నమోదు చేస్తే అన్నింటినీ క్రోడీకరించి శరీరంలో మధుమేధ స్థాయిలను వెల్లడిస్తుంది. ఈ పరికరాన్న శాస్త్రవేత్తలు నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్ అని పేరు పెట్టారు.
 
ఈ పరికరంతో ఇప్పటివరకు పలు పరీక్షలు చేయగా, మెరుగైన ఫలితాలు వచ్చాయని సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్‌లో 10 మల్టీ సెన్సార్లను అమర్చినట్టు పేర్కొన్నారు. రూ.16 వేలకే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె తిలాపుర. డయాబెటీస్ పరీక్షలకే కాకుండా గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా గుర్తించే సెన్సార్లను కూడా ఇందులో అమర్చబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరం పరిణామం పెద్దగి ఉందని, ఈ సైజును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు కుక్‌ కుమార్తెను సన్మానించిన సీజేఏ చంద్రచూడ్