Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యుత్తమంగా పనిచేస్తున్న కోవాగ్జిన్ : ఐసీఎంఆర్

అత్యుత్తమంగా పనిచేస్తున్న కోవాగ్జిన్ : ఐసీఎంఆర్
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (15:37 IST)
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. ఇది సమర్థవంతంగా పని చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని, సార్స్-కోవ్-2కు చెందిన వేర్వేరు రూపాలను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. 
 
కాగా, ఈ వ్యాక్సిన్‌ను భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తోంది. దీనికి మన దేశంలో కోవిడ్-19 చికిత్సలో అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరొక 60 దేశాల్లో కోవాగ్జిన్ వినియోగానికి అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. 
 
ఐసీఎంఆర్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 (సార్స్-కోవ్-2)కు చెందిన వివిధ రూపాలను కోవాగ్జిన్ ధ్వంసం చేసినట్లు ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను కూడా సమర్థవంతంగా నాశనం చేసినట్లు వెల్లడైంది. 
 
యూకే వేరియెంట్, బ్రెజిల్ వేరియెంట్‌లపై కోవాగ్జిన్ సామర్థ్యాన్ని ఐసీఎంఆర్-ఎన్ఐవీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ) వివరించాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ బి.1.617 సార్స్-కోవ్-2ను మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించినట్లు తెలిపాయి. 
 
దీనిని వేరుపరచి, వర్గీకరించడంలో విజయం సాధించినట్లు తెలిపాయి. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను నాశనం చేయడంలో కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని గుర్తించినట్లు వివరించాయి. 
 
మరోవైపు, పూణె కేంద్రంగా సీరం ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, కోవిషీల్డ్ ధరను సీరం ఇనిస్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 అని తెలిపింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతామని పేర్కొంది. 
 
కోవిషీల్డ్‌ ధరతో ఇతర దేశాల్లోని వ్యాక్సిన్ల ధరలను పోల్చి చెప్తూ, అమెరికన్ వ్యాక్సిన్ల ధర ఒక డోసు సుమారు రూ.1,500 ఉందని తెలిపింది. రష్యా, చైనా వ్యాక్సిన్ల ఒక డోసు ధర రూ.750కి పైనే ఉందని వివరించింది. 
 
ఇకపోతే, తాము ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ సామర్థ్యంలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని తెలిపింది. 
 
రిటైల్ వ్యాపారంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయడం సవాలుతో కూడుకున్నదని వివరించింది. రిటైల్, స్వేచ్ఛా విపణిలో ఈ వ్యాక్సిన్ సుమారు నాలుగైదు నెలల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో కోవిడ్‌: ఎక్కడ చూసినా అంబులెన్సులు, శవాలే కనిపిస్తున్నాయి