ములాయం సింగ్ 'జనతా గ్యారేజ్'... అఖిలేష్ యాదవ్ వలవల, సీఎం పదవి వదులుకుంటా...
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్ వాది పార్టీ భారీ కుదుపులకు లోనవుతోంది. గత ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తండ్రీకొడుకులు ములాయం, అఖిలేష్ యాదవ్ ల మధ్య తలెత్తిన మనస్పర్థలు తారాస్థాయ
ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్ వాది పార్టీ భారీ కుదుపులకు లోనవుతోంది. గత ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న తండ్రీకొడుకులు ములాయం, అఖిలేష్ యాదవ్‌ల మధ్య తలెత్తిన మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఐతే పైకి ఏమాత్రం కనబడటం లేదు. సోమవారం పార్టీ సమావేశంలో చీఫ్ ములాయం సింగ్ యాదవ్ తనదైన శైలిలో ప్రసంగించారు.
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్ డైలాగు ఒకటి ఉంటుంది. జనతా గ్యారేజ్‌కు అడ్డు వస్తే అలా అడ్డొచ్చే కొమ్మలనైనా, కొడుకునైనా నరికేసేందుకు వెనుకాడను. ఎవరు లేకపోయినా జనతా గ్యారేజ్ సపోర్టుతో నేను బలంగా నిలబడతాను అన్నట్లు ములాయం సింగ్ యాదవ్ సైతం అదే బాణీలో మాట్లాడుతున్నారు.
తను ఎంతగానో కష్టపడి సమాజ్ వాదీ పార్టీని ఇంతటి స్థాయికి తీసుకువచ్చాననీ, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తనను కలచివేస్తున్నాయనీ, వాటిని అధిగమిస్తానని చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదని అన్నారు. కాగా సమావేశంలో సీఎం అఖిలేష్ యాదవ్ కళ్లవెంట నీళ్లు పెట్టుకున్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, తను వేరే పార్టీ పెడతానని ప్రచారం చేస్తున్నారనీ, తన తండ్రి ములాయం ఇప్పటికిప్పుడు తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోమంటే వైదొలగుతానని చెప్పారు. మొత్తమ్మీద సమాజ్ వాదీ పార్టీలో చోటుచేసుకున్న ముసలం ఏ స్థాయికి తీసుకువెళుతుందో వెయిట్ అండ్ సీ.