Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపకు బంపర్ ఆఫర్.. పన్నీర్ సెల్వం సీఎం అయితే జయమ్మ మేనకోడలికి మంత్రి పదవి..?

జయ కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్‌కు దూరంగా పెట్టి.. ఇంతకాలం చక్రం తిప్పిన చిన్నమ్మకు అమ్మ కుటుంబ సభ్యులతోనే తగిన బుద్ధి చెప్పాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. ఇందులో భాగంగా జయలలిత మేనకోడలు దీపతో

దీపకు బంపర్ ఆఫర్.. పన్నీర్ సెల్వం సీఎం అయితే జయమ్మ మేనకోడలికి మంత్రి పదవి..?
, సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (17:10 IST)
తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మధ్య సీఎం కుర్చీ కోసం వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా అనే చందంగా విమర్శలు- ప్రతి విమర్శల హోరు కొనసాగుతోంది. తద్వారా తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో శశికళ మన్నార్గుడి గ్యాంగ్‌తో కార్యాచరణ చేస్తుంటే.. పన్నీర్ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. జయ కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్‌కు దూరంగా పెట్టి.. ఇంతకాలం చక్రం తిప్పిన చిన్నమ్మకు అమ్మ కుటుంబ సభ్యులతోనే తగిన బుద్ధి చెప్పాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా జయలలిత మేనకోడలు దీపతో పన్నీర్ వర్గం సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారు. అమ్మ ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్కేనగర్ నుంచి దీపాను బరిలోకి దించి.. ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని సెల్వం వర్గీయులు భావిస్తున్నారు. తద్వారా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు అన్నాడీఎంకే పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకుడా పన్నీర్ సెల్వం సీఎం అయితే ఆయన మంత్రి వర్గంలో దీపాకు స్థానం కల్పించాలని, అమ్మ వారసురాలిగా దీపాకు సముచిత స్థానం కల్పించి మంత్రి పదవి ఇచ్చి ప్రజల మద్దతు తీసుకోవాలని పన్నీర్ వర్గం రంగం సిద్ధం చేస్తోంది. 
 
జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో దీపాను ఒక్క సారి లోపలికి అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారు. కనీసం జయలలిత పార్థీవదేహం దగ్గర ఒక్క నిమిషం ఉండనివ్వకుండా దీపా జయకుమార్‌ను అక్కడి నుంచి పంపించేశారు. ఇలా జయలలిత కుటుంబ సభ్యులను శశికళ అడ్డుకుంటూ వచ్చి అవమానించారని ప్రజలు మండిపడుతున్నారు. 
 
కానీ అమ్మ మరణానికి తర్వాత శశికళపై దీప గుర్రుగా ఉన్నారు. ఆమె పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి శశికళ మీద పోటీ చేస్తానని దీపా జయకుమార్ ఇప్పటికే  ప్రకటించారు. ఆర్ కే నగర్ నుంచి పోటీ చెయ్యాలని ఆ నియోజక వర్గం ప్రజలు ఇప్పటికే దీపా జయకుమార్‌కు మనవి చేశారు. శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ దీపా జయకుమార్ ఇంటి దగ్గరకు ప్రతి రోజూ అన్నాడీఎంకే కార్యకర్తలు వెళ్తూనే ఉన్నారు. 
 
ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం దీపాకు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించడంతో దీపకు బంపర్ ఆఫర్ రెడీగా ఉన్నట్లేనని రాజకీయ పండితులు అంటున్నారు. దీప రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆమె ఎదుగుదలకు తాను సహకరిస్తానని పన్నీర్ సెల్వం ఇప్పటికే సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముచ్చటగా మూడో పెళ్ళి.. ఫోన్ కాల్ కొంపముంచింది.. భర్తను కిరోసిన్ పోసి నిప్పంటించింది.. ఆపై..?