ప్రధాని అవినీతిపై నావద్ద కీలక సమాచారం ఉంది... రాహుల్ గాంధీ ప్రకటన
సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి అవినీతి చిట్టా తన వద్ద ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ అవినీతికి సంబంధించి సభలో తాను చర్చించాలని పట్టుబట్టినా తనను మాట్లాడకుండా తన గొ
సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి అవినీతి చిట్టా తన వద్ద ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ అవినీతికి సంబంధించి సభలో తాను చర్చించాలని పట్టుబట్టినా తనను మాట్లాడకుండా తన గొంతు నొక్కేశారని ఆరోపించారు. నోట్ల రద్దుపై మాట్లాడేందుకు ప్రధానమంత్రి ఎందుకు అంతగా భయపడిపోతున్నారో తనకు తెలుసుననీ, ఆయన చేసిన తెలివితక్కువ పనులను నిలదీస్తామని భయంతో తమను సభలో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.
దాదాపు 30 రోజులుగా సభలో నోట్ల రద్దుపై చర్చించాలని అన్ని పక్షాలు కోరుతుంటే ప్రధానమంత్రి దీనికి అనుగుణంగా చర్చ ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై సామాన్యులు కష్టాలు పడుతుంటే ఆయన పాప్ కాన్సర్టులకు, పబ్లిక్ మీటింగులకు వెళుతున్నారని మండిపడ్డారు. సామాన్యుల కష్టాలు ప్రధానమంత్రికి పట్టవా అని ప్రశ్నించారు.