Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్

నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బదిలీ బహుమతిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కానీ, ఆ అధికారిణి మాత్రం తాను నిర్వహించ

Advertiesment
గుడ్ వర్క్‌కు దక్కిన రివార్డు... వెలుగునిచ్చే దీపానికి సొంతిల్లు ఉండదు ... బదిలీపై శ్రేష్టా ఠాకూర్
, మంగళవారం, 4 జులై 2017 (11:48 IST)
నిజాయితీగా విధులు నిర్వహించినందుకు డీఎస్పీ శ్రేష్టా ఠాకూర్ అధికారిణికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బదిలీ బహుమతిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కానీ, ఆ అధికారిణి మాత్రం తాను నిర్వహించిన మంచి విధులకు దక్కిన బహుమతి అంటూ వినమ్రయంగా పేర్కొంటూ.. తన మంచి కోరుకునే మిత్రులెవ్వరూ బాధపడవద్దని ప్రాధేయపడ్డారు. 
 
గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో యూపీలో పనిచేస్తున్న మహిళా సీఐ శ్రేష్టా ఠాకూర్‌కు సంబంధించిన ఓ వీడియో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. నిజాయితీ గల పోలీసులు గర్వపడేలా విధులు నిర్వర్తించిన ఈ మహిళా పోలీసు గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. యూపీ వంటి పెద్ద రాష్ట్రం... అందులో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ నేతలనే అరెస్ట్ చేయడంతో ఆమె నిజాయితీని దేశ ప్రజలంతా అభినందించారు. పోలీసులు పనిచేయాల్సింది ప్రజల కోసమని, పార్టీల కోసం కాదని శ్రేష్టా నిరూపించారు. 
 
అయితే, తమ నేతను అరెస్టు చేయడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోయారు. ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద మొరపెట్టుకున్నారు. బీజేపీ అధిష్టానానికి ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో తలొగ్గిన యూపీ సర్కారు ఆమెను బదిలీ చేసింది. ఈ బదిలీతో ఆమె మరోమారు వార్తలకెక్కారు. దీంతో యూపీ సీఎంపై, స్థానిక పోలీసు అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీగా పనిచేసినందుకు ఇలా చేస్తారా అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
webdunia
 
ఈ నేపథ్యంలో.. తన బదిలీ ఉత్తర్వులపై శ్రేష్టా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. నేపాల్ బోర్డర్‌కు సమీపంలో ఉన్న బరైచ్‌కు తనను ట్రాన్స్‌ఫర్ చేశారని, తన మంచి కోరుకునే మిత్రులెవరూ బాధపడవద్దన్నారు. తాను సంతోషంగానే ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాను మంచిగా విధులు నిర్వర్తించినందుకు తనకు దక్కిన బహుమానంగా బదిలీని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాంతిని ఎక్కడ దాచినా.. తన వెలుగును వ్యాపింపజేస్తూనే ఉంటుందని గుర్తు చేశారు. వెలుగునిచ్చే దీపానికి సొంత ఇల్లు అనేది ఉండదని శ్రేష్టా ఠాకూర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌పై ఆమె స్పందించిన తీరును పలువురు హర్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నే కాటేశాడు... చెల్లిని వంచించి గర్భవతిని చేశాడు... ఎక్కడ?