Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై గ్యాంగ్ రేప్‌కు యత్నం.. బీర్ బాటిల్స్ ఖాళీ చేసి..

పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై (20) తెలిసిన వ్యక్తులే గ్యాంగ్ రేప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించింది. అయితే కామాంధుల నుంచి తప్పించుకున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్

Advertiesment
పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై గ్యాంగ్ రేప్‌కు యత్నం.. బీర్ బాటిల్స్ ఖాళీ చేసి..
, ఆదివారం, 14 మే 2017 (16:43 IST)
పబ్బులో డ్యాన్స్ చేసే యువతిపై (20) తెలిసిన వ్యక్తులే గ్యాంగ్ రేప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం సృష్టించింది. అయితే కామాంధుల నుంచి తప్పించుకున్న  బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. సీతాఫల్‌ మండికి చెందిన యువతి రాత్రి పది గంటల సమయంలో తనకు కొంతకాలంగా పరిచయం ఉన్న రవి అనే క్యాబ్‌ డ్రైవర్‌‌తో కలసి ఉప్పల్ బయలుదేరింది. 
 
మార్గమధ్యంలో రవికి పరిచయస్తులైన మరో ముగ్గురు యువకులు కారులో ఎక్కారు. ఉప్పల్‌‍లో వీరు బీరు కొనుగోలు చేసి.. ఆపై నారపల్లి-చౌదరగూడ మార్గానికి కారును తీసుకెళ్లారు. అక్కడ తాము తెచ్చుకున్న బీర్లను ఖాళీ చేసి.. ఆపై డ్యాన్సర్ అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె కేకలు పెట్టడంతో వెనక్కి తగ్గి ఆమెను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. 
 
సాయం కోసం బాధితురాలు 100కు ఫోన్‌ చేసింది. దీంతో అక్కడికి దగ్గర్లోనే ఉన్న మేడిపల్లి పోలీసులు స్పందించి.. ఆమె వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సవతి తండ్రి ఘాతుకం.. పదేళ్ల చిన్నారిపై రేప్.. ఐదునెలల గర్భవతిని చేశాడు..