Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారులు కాదు.. చిచ్చర పిడుగులు.. ఆలరించిన ఫ్యాషన్ షో

జూనియర్ ఫ్యాషన్ వీక్‌ 2017లో భాగంగా చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన చిన్నారుల ఫ్యాషన్ షో ఆద్యంతం ఆలరించింది. బుడిబుడి అడుగులు, వయ్యారి నడకలతో వారు చేసిన ర్యాంప్ వాక్ ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గు

Advertiesment
Juniors Fashion Week
, సోమవారం, 10 జులై 2017 (10:02 IST)
జూనియర్ ఫ్యాషన్ వీక్‌ 2017లో భాగంగా చెన్నైలోని ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన చిన్నారుల ఫ్యాషన్ షో ఆద్యంతం ఆలరించింది. బుడిబుడి అడుగులు, వయ్యారి నడకలతో వారు చేసిన ర్యాంప్ వాక్ ఆహుతులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఐదు నుంచి 14 యేళ్ళలోపు బాలబాలికలు చేసిన ఈ క్యాట్ వాక్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
 
ఈ ఫ్యాషన్‌లో మొత్తం 128 మంది పాల్గొని తమ వయ్యారపు వంపుసొంపులతో, నడకతో ఆలరించారు. ఎంతో అనుభవం ఉన్న ఫ్యాషన్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిన్నారుల క్యాట్ వాక్ చేశారు. వీటిని చూసిన చిన్నారుల తల్లిదండ్రులు, ప్రత్యేక ఆహ్వానితులు మంత్రముగ్ధులను చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులను ధరించి, బుడిబుడి అడుగులు వేసుకుంటూ వారు ర్యాంప్‌పై నడవడం ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంది.
 
ఈ సందర్భంగా అరవింద్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ లిమిటెడ్ సీఈఓ అలోక్ దుబే మాట్లాడుతూ... దేశంలో కిడ్స్ వేర్ మార్కెట్‌లో ఎన్నో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా.. జూనియర్స్ ఫ్యాషన్ వీక్‌లో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. తమ కిడ్స్ కలెక్షన్స్‌ను సరైన వేదికపై చిన్నారులు పదర్శించారని చెప్పారు. ముఖ్యంగా.. తమ కలెక్షన్స్ క్లాసిక్ అమెరికన్ స్టైల్‌లో ఉంటాయని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన మధురపలం దానిమ్మతో షుగర్‌కి చెక్