Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'For sale one wife' : భార్యను 'ఈబే'లో అమ్మకానికి పెట్టిన భర్త.. 65,880 పౌండ్లకు బిడ్లు

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అమ్మకానికి పెట్టాడు. ఈకామర్స్ దిగ్గజం ఈబేలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఆయనకు 65,880 పౌండ్లకు బిడ్లు రావడం గమనార్హం. ఈ వివరాలను పర

Advertiesment
'For sale one wife' : భార్యను 'ఈబే'లో అమ్మకానికి పెట్టిన భర్త.. 65,880 పౌండ్లకు బిడ్లు
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (08:39 IST)
బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను అమ్మకానికి పెట్టాడు. ఈకామర్స్ దిగ్గజం ఈబేలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఆయనకు 65,880 పౌండ్లకు బిడ్లు రావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బ్రిటన్, వోక్ ఫీల్డ్‌లోని యార్క్ షైర్‌కు చెందిన ప్రాంక్ స్టార్ జోకెర్ సిమన్ ఓకనె (33) అనే వ్యక్తి తన భార్య లియాండ్రాను ఈబేలో అమ్మకానికి పెట్టాడు. ఈ సందర్భంగా తన భార్యను ఎందుకు విక్రయించాలనుకుంటున్నదీ, ఆమె వివరాలు పూర్తిగా పేర్కొన్నాడు. తన భార్య గురించి ఓకనే చెపుతూ.. 'ఫర్ సేల్ వన్ వైఫ్' అంటూ మొదలు పెట్టి లియాండ్రాకు దైవభక్తి అస్సలు లేదని, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆమె కనీసం దైవపూజలు కూడా చేయలేదని, పైపెచ్చు తనను మాటలు, చేతలతో హింసిస్తోందనే అమ్మకానికి పెట్టానని తెలిపాడు.
 
ఆమె గుణగణాల గురించి చెబుతూ, లియాండ్రా చక్కగా నవ్వుతుందని, జిమ్ వర్క్ చేయడంతో మరింత చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని తెలిపాడు. వంటపనిలో ఆమెకు తిరుగులేదన్నాడు. ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెకున్న లోపమని చెప్పాడు. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొన్న సిమన్, ఆమె చాలా మంచిదని తెలిపాడు. ఇదేసమయంలో ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదని షరతు విధించాడు. 
 
ఈ భార్య సేల్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. అయితే, తనను అమ్మకానికి పెట్టాడని తెలుసుకున్న లియాండ్రా అతనిని చంపేస్తానని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔషధం రుచి చూసి కోమాలోకి వెళ్లిన ఆయుర్వేద వైద్యుడి మృతి