Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది.. భర్త చంపేశాడా?

అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక

Advertiesment
Husband kills wife
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:11 IST)
అనుమాన భూతం ఆ వివాహిత ప్రాణం తీసింది. అనుమానంతో భార్యను హత్య చేసిన సంఘటన తమిళనాడు తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్నూరు పెరియకుప్పంకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మాలిక్‌ భార్య సుగంధి మాలిక్‌(30). దంపతులిద్దరు భవన నిర్మాణ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానంతో ప్రేమ్‌కుమార్‌ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆదివారం ఉదయం పది గంటలవుతున్నప్పటికీ ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు ఎన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
స్థానికుల ఫిర్యాదు మేరకు సుగంధి ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్ళి చూశారు. అక్కడ సుగంధి మృతి చెంది వుండడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల అందించిన సమాచారంతో అనుమానంతో భర్తే ఆమెను హత్య చేసి వుండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న మాలిక్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో మనస్పర్థలతో పుట్టింటికి వెళ్ళిపోయిన భార్య.. తాగుడికి బానిసై.. కత్తితో దాడి..