Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో మందుబాబులుగా మారిన ఎలుకలు.. సీసాలు సీసాలు తాగేశాయట..!

బీహార్‌లో మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ అధికారం చేపట్టగానే మద్యంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు

Advertiesment
Humans
, గురువారం, 4 మే 2017 (14:09 IST)
బీహార్‌లో మద్యంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ అధికారం చేపట్టగానే మద్యంపై నిషేధం విధించారు. అయితే ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సరుకును పోలీస్ స్టోర్ రూమ్స్‌లో పెట్టారు. కానీ ఈ మద్యం మాత్రం ఒకటి తర్వాత ఒకటి ఖాళీ అయిపోతూ వచ్చాయి. అయితే ఈ మందును రుచి చూసింది పోలీసులేనని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. ఇక పాట్నా ఏఎస్పీ మను మహరాజ్ మద్యంపై కన్నేశారు. 
 
ఆ గదులకు కాపలా కాస్తున్న సిబ్బందికి బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేయించారు. ఒక్కరూ పట్టుబడలేదు. ఈ క్రమంలో టెస్టుకు ఓ కానిస్టేబుల్ అంగీకరించకపోవడంతో ఆయన్ని పదవి నుంచి తొలగించారు. కానీ, మద్యం సీసాలను ఎవరు ఖాళీ చేస్తున్నారనే విషయం మాత్రం తేలలేదు. చివరికి అసలు విషయం తెలియవచ్చింది. తీవ్రంగా చేసిన దర్యాప్తులో మందు సీసాలు ఎలుకలే ఖాళీ చేస్తున్నట్లు తేలింది. 
 
పోలీస్ స్టోర్ రూమ్స్ నిండా విపరీతమైన ఎలుకలు ఉండటంతో.. మద్యం సీసాల మూతలను కొంచెం కొంచెంగా కొరికేసి మందు కొట్టేస్తున్నాయని తేలింది. ఒకటో రెండో మద్యం బాటిల్స్ కాదు.. ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఎంచక్కా ఎలుకలు తాగేశాయని తేలింది. దీంతో, పోలీసు సిబ్బందితో సమావేశమైన మహారాజ్ స్టోర్ రూమ్‌లో ఎలుకలు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదన్నమాట మందు తాగే ఎలుకల కథ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాగ్నిజెంట్ సుతిమెత్తని హెచ్చరిక... 9 నెలల జీతాలిస్తాం... బుద్ధిగా వెళ్ళిపోండి!