Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్మకు వస్తానని యోగి మాటిచ్చారు.. నాన్నకు అంత్యక్రియలు పూర్తి చేశాం.. ప్రేమసాగర్ కుమారుడు

పాకిస్థాన్ ముష్కర చేతిలో వీరమరణం పొందిన అమరజవాను ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ మేరకు వీటిని పూర్తి చేశారు. సరిహద్దులను దాటుకు

Advertiesment
కర్మకు వస్తానని యోగి మాటిచ్చారు.. నాన్నకు అంత్యక్రియలు పూర్తి చేశాం.. ప్రేమసాగర్ కుమారుడు
, బుధవారం, 3 మే 2017 (14:50 IST)
పాకిస్థాన్ ముష్కర చేతిలో వీరమరణం పొందిన అమరజవాను ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ మేరకు వీటిని పూర్తి చేశారు. సరిహద్దులను దాటుకుని భారత భూభాగంలోకి వచ్చి మరీ జవాను ప్రేమ్ సాగర్‌ను హతమార్చారు. 
 
ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని ముక్కలు చేశారు. ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామమైన డోరియాకు తీసుకొచ్చారు. అయితే ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని తమకు చూపించేంతవరకు అంత్యక్రియలు జరగనిచ్చేదిలేదని కుటుంబీకులు, గ్రామస్తులు పట్టుబట్టారు. 
 
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో తమతో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. అప్పటికే అర్థరాత్రి దాటిపోవడంతో చివరికి సీఎం యోగి ఫోన్ చేసి సాగర్ పెద్ద కుమారుడితో మాట్లాడారు. '13వ రోజు శార్థ కార్యక్రమానికి వచ్చి ముఖ్యమంత్రి మా కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు. మా తండ్రి పేరుమీదుగా ఓ పాఠశాల నిర్మిస్తామని, మెమోరియల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు'' అని సాగర్ కుమారుడు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా, ఆస్ట్రేలియాల్లో జాత్యహంకారం.. ట్రంప్‌కు నిరసనగా చీర.. భారతీయులా వెళ్ళిపోండి..