కాంగ్రెస్ పార్టీకి జన్మలో చేతకానిదీ.. బీజేపీకి చేతనైందీ ఇదే.. అయిదు గంటల్లో కొత్త సీఎం
కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు తపస్సు చేసినా రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో, అమలు చేయడంలో బీజేపీ కాలిగోటికి కూడా సరిపోదని మరోసారి తేలిపోయింది. లాలూ ప్రసాద్ కుటుంబాన్ని అధికారం నుంచి దూరం చేయడానికి అత్యంత రహస్యంగా ఎన్డీయే కూటమి, జేడీయూ పార్టీలు పన్
కాంగ్రెస్ పార్టీ సంవత్సరాలు తపస్సు చేసినా రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో, అమలు చేయడంలో బీజేపీ కాలిగోటికి కూడా సరిపోదని మరోసారి తేలిపోయింది. లాలూ ప్రసాద్ కుటుంబాన్ని అధికారం నుంచి దూరం చేయడానికి అత్యంత రహస్యంగా ఎన్డీయే కూటమి, జేడీయూ పార్టీలు పన్నిన పథకం ఎంతగా పేలిందంటే కేవలం అయిదుగంటల వ్యవధిలో బీహార్ వంటి పెద్ద రాష్ట్రంలో ముఖ్యమంత్రే రాజీనామా చేసిపడేసి మళ్లీ సీఎం పోస్టును దక్కించుకున్నారు. ఇదీ రాజకీయమంటే. ఇదీ నిర్ణయాలను కంటికి కనిపించకుండా తీసుకుని అమలు చేయడమంటే. లాలూ కుటుంబం అవినీతి కంపులో ఇక కొనసాగబోనని తేల్చుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ బుధవారం సాయంత్రం అలా రాజీనామా సమర్పించడం ఇలా మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. ఒక సాయంత్రం మొదలైన సంక్షోభం ఆ రాత్రి గడవకముందే పరిష్కారమైపోవటం. రాజకీయ చాణక్యుడైన లాలూయే కుదేలైపోవడం ఇటీవలి రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగనిది.
ఢిల్లీ స్థాయిలో తీసుకున్న కీలక నిర్ణయం బీహార్‌లో నిశ్శబ్దంగా పేలింది. ఐదంటే ఐదే గంటల్లో బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే కూటమిలోకి బీజేపీ వచ్చి చేరింది. కాషాయపెద్దలు ఇచ్చిన హామీ ప్రకారం.. గంటల వ్యవధిలోనే నితీశ్ కుమార్‌కు తన ముఖ్యమంత్రి పదవి తిరిగి దక్కింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ కుటుంబం(ఆర్జేడీ)తో కొనసాగబోనన్న బిహార్ సీఎం నితీశ్ కుమార్.. తన పార్టీ(జేడీయూ) ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం బుధవారం సాయంత్రం 630 గంటలకు గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి రాజీనామా సమర్పించారు. ఆయన రాజ్‌భవన్ గేటు దాటకముందే బీజేపీ తన మద్దతును అధికారికంగా ప్రకటించింది.
దీంతో రాత్రి 1030 గంటలకు గవర్నర్ త్రిపాఠి కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీశ్‌ను ఆహ్వానించారు. గురువారం నితీశ్ బిహార్ సీఎంగా మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు హాజరుకావచ్చని శ్రేణులు భావిస్తున్నాయి.
లాలు ప్రసాద్ తనయుడు తేజస్విపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసు నేపథ్యంలో అధికార మహాకూటమిలో మిత్రపక్షాలైన ఆర్జేడీ, జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇచ్చిన కొద్ది వ్యవధిలోనే జేడీయూ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలతో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఆర్జేడీ తరపున నితీష్ కుమార్ బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీలు నేతృత్వం వహించారు. కాగా, నితీశ్ మహాకూటమికి మహాద్రోహం తలపెట్టాడని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. బిహార్ లోని పలు ప్రాంతాల్లో నితీశ్‌కు వ్యతిరేకంగా ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు.