యూపీలో దారుణం చోటుచేసుకుంది. చెల్లెలు ప్రేమించిందని ఓ అన్నయ్య ఆమెను పరువు కోసం హత్య చేశాడు. చెల్లి ప్రేమ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు ఆమె తలనరికి చంపేశాడు. ఆమె తల తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళుతుండగా మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారాబంకీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మిత్వారా గ్రామానికి చెందిన ఆషిఫా (18), అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతని కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు బాలిక ఆచూకీ కనుక్కుని ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇటీవల ఈ విషయమై ఆషిఫాకు ఆమె అన్న రియాజ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశానికి గురైన రియాజ్ చెల్లెలి గొంతు కోసం హత్య చేశాడు. ఆపై పోలీసుల ఎదుట లొంగిపోదామనుకుని బయల్దేరారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.