Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఎన్నారై లేడీ వలపన్నిందంటే... పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టదు.. రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్

రాజస్థాన్ రాష్ట్రంలో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు చేధించారు. ఈ రాకెట్‌లో ఓ ఎన్నారై లేడీ ప్రధాన సూత్రధారిగా ఉండటం గమనార్హం. పైగా ఈ లేడీ పలపన్నిందంటే... పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టదు. అలా వల పన్న

ఆ ఎన్నారై లేడీ వలపన్నిందంటే... పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టదు.. రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్
, శనివారం, 7 జనవరి 2017 (13:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు చేధించారు. ఈ రాకెట్‌లో ఓ ఎన్నారై లేడీ ప్రధాన సూత్రధారిగా ఉండటం గమనార్హం. పైగా ఈ లేడీ పలపన్నిందంటే... పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టదు. అలా వల పన్ని ఎంతో మందిని మోసం చేసిన ఈ కిలేడీ.. ఇపుడు పోలీసుల వలకు చిక్కి చివరకు ఊ
చలు లెక్కిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హాంకాంగ్ పుట్టిపెరిగి ప్రస్తుతం పంజాబ్‌లోని తన అమ్మమ్మ దగ్గర ఉంటోన్న 26 యేళ్ల యువతి. ఈమె పేరు రవనీత్ కౌర్. ఈ ఎన్నారై లేడి గత 2008లో ఆమె పంజాబ్‌లోని సొంతూరుకు వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్‌లో ఓ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. 2009లో గుర్గాన్ వచ్చి తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి నివాసం ఉంది.
 
2012లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ చదువుకునేటపుడు రోహిత్ శర్మ అనే ఎంబీఏ విద్యార్థితో ప్రేమలో పడింది. కోర్సు పూర్తయ్యాక ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. రోహిత్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆ కథ అక్కడితో ముగిసింది. జాబ్ లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గం కోసం వెతికింది.
 
2013లో సెక్స్ రాకెట్‌ను శాసించే అక్షిత్ శర్మను కలుసుకుంది. అతడు ఆమె ద్వారా తన అవసరాలు తీర్చుకోవడమే కాకుండా, నెలకు రూ.12 వేలు జీతం వచ్చే ఉద్యోగమిచ్చాడు. అక్కడ నుంచి తన టాలెంట్‌ను ప్రదర్శించసాగింది. మొదటి ప్రయత్నంగా 2014లో ఓ ప్రముఖ బిల్డర్ దగ్గరకు ఆమె వెళ్లింది. ఆ తర్వాత సదరు ముఠా సభ్యులు రేప్ కేసుపెడతామని బెదిరిస్తూ రూ.1.20 కోట్లు డిమాండ్ చేశారు.
 
ఇందుకుగానూ ఆ ముఠా నుంచి రవనీత్‌ తొలి డీల్‌లోనే రూ.30 లక్షలు అందుకుంది. తర్వాత ఇదే గ్యాంగ్ డాక్టర్లు మొదలు బిల్డర్ల దాకా అనేక మందిని లక్ష్యంగా చేసుకుని డబ్బులు గుంజింది. గతేడాది ఫిబ్రవరిలో రోహిత్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. దాదాపు రూ.కోటికి పైనే సంపాదించిందనీ.... కనీసం ఆరుగురిని బ్లాక్ మెయిల్ చేసినట్టు తేలింది. 
 
తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ప్రేమ, పెళ్లి కాకుంటే అందాన్ని ఎరగా వేయడం.. ఏదోరూపంలో డబ్బు దండుకోవడం ఈమె ప్రత్యేకత. ఆమెను ఎరగా వేసి ఈ వ్యవహారం కాస్తా పోలీసుల వద్దకు వెళ్లడంతో అసలు వ్యవహారం బయటికి వచ్చింది. పోలీసుల విచారణలో రవనీత్ కౌర్ వ్యవహారం సినిమా స్టోరీకి తీసిపోని వాస్తవాలు వెలుగుచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో దెబ్బతో వొడాఫోన్ సూపర్ ఆఫర్.. రూ.16కే గంట పాటు 3జీ 4జీ డేటా