Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే.. నకిలీ పత్రాలతో ఉద్యోగం!

Advertiesment
ఆయన అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే.. నకిలీ పత్రాలతో ఉద్యోగం!
, గురువారం, 18 నవంబరు 2021 (18:29 IST)
బాలీవుడ్ బాద్షా కుమారుడిని మాదకద్రవ్యాల కేసులో అరెస్టు చేసిన ముంబై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని, అతను ముస్లిం అని రుజువు చేసే పాఠశాల సర్టిఫికెట్లు గురువారం వెలుగుచూశాయి.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) గురువారం సమీర్ వాంఖడేకు చెందిన రెండు పాఠశాల సర్టిఫికేట్‌లను విడుదల చేయడం సంచలనం రేపింది. స్కూలు సర్టిఫికెట్లలో సమీర్ పేరు మధ్య ‘దావూద్’ అని ఉంది. వడాలలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, దాదర్ లోని సెయింట్ పాల్ హై స్కూల్ సర్టిఫికెట్లలో సమీర్ ‘దావూద్’ వాంఖడే అని ఆ ధృవపత్రాల మతం కాలమ్ లో ‘ముస్లిం’ అని ఉంది. 
 
ఎన్సీపీ శిబిరం విడుదల చేసిన 1995 నాటి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లో అతని పేరు వాంఖడే సమీర్ ద్యాందేవ్ అని  కులాన్ని ‘మహర్’ అని ఉంది.ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయినప్పటి నుంచి సమీర్ వాంఖడేపై విరుచుకుపడుతున్న ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఇప్పుడు ఎన్సీబీ అధికారి ముస్లిం అని ఆరోపించారు.

వాంఖడే ముస్లింగా జన్మించాడని యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎస్సీ కోటా కింద ఉద్యోగం పొందేందుకు అతను హిందూ ఎస్సీ వర్గానికి చెందినవాడినని కుల ధృవీకరణ పత్రంతో సహా నకిలీ పత్రాలను రూపొందించారని మంత్రి నవాబ్ మాలిక్ గతంలో ఆరోపించారు. నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా విడుదల చేశారు. 
 
సమీర్ ఐఆర్ఎస్ అధికారిగా ఉద్యోగం పొందేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించాడని మంత్రి ఆరోపించారు.సమీర్ వాంఖడే క్యాంపు పత్రాలపై మాలిక్ స్పందిస్తూ, సమీర్ వాంఖడే ఇప్పుడు బోగస్ సర్టిఫికెట్‌లను బయటపెడుతున్నారని అన్నారు.

‘‘అతను కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నాడు. అవన్నీ బోగస్. మేం నిజమైన సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించాం, అవన్నీ డాక్యుమెంట్ చేశారు. అతను ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం ఖాయం’’అని మంత్రి మాలిక్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో రోడ్లు కాద‌వి, చెరువులే... తుఫాను ఎఫెక్ట్!