#HimachalPradeshElections : ఓటు వేసిన శతాధిక వృద్ధుడు.. 74 శాతం పోలింగ్
పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్ నమోదైంది. 68 నియోజకవర్గా
పర్వత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 74 శాతం ఓటింగ్ నమోదైంది. 68 నియోజకవర్గాల్లో మొత్తం 337 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
సిమ్లా పట్టణంలో 66 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం వీరభద్రసింగ్, బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్, కేంద్రమంత్రి జేపీ నడ్డాతోపాటు పలువురు ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 18న చేపట్టనున్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో శతాధిక వృద్ధుడు శ్యామ్ సరన్ నేగి (101) తన ఓటు హక్కును కల్పా పోలింగ్ కేంద్రంలో వినియోగించుకున్నారు. 1917 జూలై ఒకటో తేదీన జన్మించిన ఈయన.. స్వతంత్ర భారతావనిలో 1951లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తొలి ఓటరు కావడం కావడం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు.