Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్థానిక సంస్థల ఎన్నికల్లో హిజ్రాలు దరఖాస్తు చేసుకోవచ్చు.. అమ్మ పిలుపు.. ఖుషీ ఖుషీ

తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిజ్రాలకు బంపర్ ఆఫర్ వచ్చింది. హిజ్రాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చునని తమిళనాడు సీఎం జయలలిత ఇచ్చిన పిలుపునకు హిజ్రాలు స్పందించారు

Advertiesment
Hijra Competing In Tamil Nadu Elections
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (11:58 IST)
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిజ్రాలకు బంపర్ ఆఫర్ వచ్చింది. హిజ్రాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చునని తమిళనాడు సీఎం జయలలిత ఇచ్చిన పిలుపునకు హిజ్రాలు స్పందించారు. వేలాదిమంది ముందుకొచ్చి కౌన్సిలర్, జిల్లా పంచాయతీ మెంబర్, యూనియన్ కౌన్సిలర్ తదితర పదవులకు టికెట్లు కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు. 
 
కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్‌కు సుధ, 109వ డివిజన్‌కు నూరి, మధురై సౌత్‌ 74వ డివిజన్‌కు భారతి దరఖాస్తు చేసుకున్నారు. సుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సంపాదించేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా భారతి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.
 
ఇంకా ఈ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవలు చేస్తామని హిజ్రాలు వెల్లడించారు. అంతేగాకుండా నగరానికి చెందిన ముగ్గురు హిజ్రాలు స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని దరఖాస్తులు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ మద్దతుదారులతో కలిసి వచ్చి దరఖాస్తులు అందజేశారు.
 
ఇదిలా ఉంటే.. కావేరీ జలాల వివాదంలో తమిళనాడు చేపట్టిన బంద్ సందర్భంగా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గాయి. పెద్ద ఎత్తును ఆందోళనలు చేస్తామని ముందుగానే ప్రకటించిన ప్రతిపక్షాలు బంద్ సందర్బంగా శాంతియుతంగా ఆందోళనలు చేసి సైలెంట్ అయిపోయారు. బంద్ సందర్బంగా 1.8 లక్షల మంది పోలీసులు బందోబస్తులో పాల్గోన్నారు.
 
ఎవరైనా హింసాత్మకంగా బంద్ నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జయలలిత పోలీసులకు సూచించారు. జయలలిత ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షాల మీద కేసులు పెడుతారనే భయంతో ప్రతిపక్ష

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి మండింది... జ‌గ‌న్ గూటికి చేరిపోతారా?