మద్యం సేవించే నటి హేమమాలిని ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు : మహారాష్ట్ర ఎమ్మెల్యే
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్
మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే ఓం ప్రకాష్ బాబారావు అలియాస్ బచ్చు కడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగే అలవాటు వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మద్యం సేవించడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే... అవే నిజమైతే బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రతి రోజూ మద్యం తాగుతారని అలాంటప్పుడు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోలేని ఆయన ప్రశ్నించారు. 'రైతులు మద్యం తాగే అలవాటు వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇది నిజం కాదన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులలో 75 శాతం మంది మద్యం తాగుతున్నారు. హేమామాలిని అయితే, ప్రతి రోజూ మద్యం తాగుతారు. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు కదా?' అని ఆయన వ్యాఖ్యానించారు. 'నిజానికి రైతుల బలవన్మరణాలకు ఆర్థిక ఇబ్బందులే కారణం. వారి కష్టానికి తగినట్లుగా ఉత్పత్తి పెరుగుతోంది. కానీ వారి ఆదాయం మాత్రం పెరగడం లేదు' అని ఆగ్రహం వ్యక్తంచేశారు.