Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్యూటీని మరిచి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన డాక్టర్లు.. చివరికి ఏమైందంటే?

Doctors

సెల్వి

, శుక్రవారం, 25 అక్టోబరు 2024 (15:43 IST)
యూపీలో ఐదేళ్ల బాలికకు చికిత్స అందక జ్వరంతో మృతి చెందిన కేసులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇద్దరు కాంట్రాక్టు వైద్యులను తొలగించి, ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో శుక్రవారం ఒక అధికారి తెలిపారు.
 
తమ కుమార్తెకు వైద్యం చేయకుండా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది క్రికెట్‌ ఆడటం వల్లే ఆమె చనిపోయిందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైద్య కళాశాల యాజమాన్యం విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 
 
ఈ కమిటీ గురువారం సాయంత్రం వారు తమ నివేదికను సమర్పించింది. ఘటన జరిగిన సమయంలో కొందరు వైద్యులు తమ డ్యూటీని వదిలి క్రికెట్ ఆడుతున్నట్లు నివేదిక ధృవీకరించింది.
 
ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఈఎన్‌టీ విభాగం డాక్టర్ అభిషేక్ శర్మ, పీడియాట్రిక్ విభాగం డాక్టర్ ఇమ్రాన్‌లను నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయబడిన, తొలగించబడిన వైద్యులు క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదని డాక్టర్ కుమార్ ఇంకా స్పష్టం చేసారు. 
 
సస్పెన్షన్‌కు గురైన, తొలగించబడిన వైద్యులు క్రికెట్ మ్యాచ్ ఆడలేదని, దానిని చూడటానికి వెళ్లారని మరో డాక్టర్ కుమార్ స్పష్టం చేశారు. డ్యూటీ సమయంలో ఇతర పనుల్లో నిమగ్నమవ్వడం నిర్లక్ష్యం కిందకు వస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ కుటుంబ వ్యాపారులకు జగన్ ఒక గార్డియన్ మాత్రమే.. వైఎస్ షర్మిల