జేడీఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే రుణమాఫీ : కుమార స్వామి
కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొ
కర్నాటక రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నాటకలోని రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి కన్నీటిని తుడిచే నేత కంటికి కనిపించడం లేదన్నారు.
ముఖ్యంగా రైతులు కష్టాలలో ఉన్నారని నదీ నీరు లభించడం లేదని కొన్నేళ్ల కాలంగా సాగు చేసిన పంట చేతికి రావడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం సున్నితమైన అంశంగా భావించడం లేదన్నారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు రూ.2,500 కోట్లు రుణమాఫీ చేశానన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే 24 గంటలలోగానే రుణమాఫీ చేస్తానని ప్రకటించారు