Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆటో ఎక్కిన మహిళపై గ్యాంగ్ రేప్.. ఆమె చేతిలో ఉన్న చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు..

హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై కామాంధులు కిరాతకంగా వ్యవహరించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా.. ఆమె చే

Advertiesment
Haryana
, మంగళవారం, 6 జూన్ 2017 (12:26 IST)
హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై కామాంధులు కిరాతకంగా వ్యవహరించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా.. ఆమె చేతిలోని ఎనిమిది నెలల చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు. ఈ ఘటనతో తలకు తీవ్రంగా గాయాలైన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మే 29న ఈ ఘటన జరగినప్పటినీ.. సోమవారమే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. 23 ఏళ్ల బాధితురాలి భర్తకు ఇరుగుపొరుగు వారితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి కోపగించుకుని వెళ్ళిపోయాడు. దీంతో  బాధిత మహిళ ఆ రాత్రి ఖండా రోడ్డులో ఉండే తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. ఆటో ఎక్కిన వెంటనే కామాంధులు తన పక్కకు వచ్చి లైంగికంగా వేధించారు.
 
ఏడుస్తున్న పాపను బలవంతంగా తన చేతుల్లోంచి లాక్కుని రోడ్డుపైకి విసిరేశారని ఏడుస్తూ పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన అనంతరం వారు పారిపోయారని వివరించింది. ఈ దుర్ఘటనపై  బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, వేధింపుల కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీటీవీ దినకరన్‌‌ను ఎప్పుడో పార్టీ నుంచి తొలగించాం.. శశికళతో సంబంధం లేదు