హర్యానాలో గొడ్డు మాంసం బిర్యానీపై గగ్గోలు...
హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడ్డు మాంసం బిర్యానీ గగ్గోలు పుట్టిస్తోంది. ఓ మతవర్గం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిర్యానీ విక్రయాలు జరుగుతున్నాయంటూ వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు
హర్యానా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడ్డు మాంసం బిర్యానీ గగ్గోలు పుట్టిస్తోంది. ఓ మతవర్గం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ బిర్యానీ విక్రయాలు జరుగుతున్నాయంటూ వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
బిర్యానీ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం హిసార్‌లోని హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ల్యాబ్‌కు పంపించారు. గోసేవా ఆయోగ్ ఛైర్మన్ తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
దీనిపై గోసేవా ఆయోగ్ ఛైర్మన్ బాని రామ్ మంగళ స్పందిస్తూ... మెవాత్, నుహ్, ఫిరోజ్ పూర్, జిర్ఖా, నగీనా, పున్హానా, బాదాస్, షా చోకా, షిక్రవా, రావ్లీ తదితర ప్రాంతాల్లో గొడ్డు మాంసంతో బిర్యానీ తయారు చేసి విక్రయిస్తున్నారంటూ వార్తలు వచ్చాయని, దీంతో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపనున్నట్టు తెలిపారు.