కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ మహిళా నేత హర్ సిమ్రత్ కౌర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం నుంచి శ్వాస పీల్చడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆమె చండీగఢ్‌లోని పీజీఐ ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ క్రమంలో ఆమెకు వైద్యులు కరోనా పరీక్షలు చేయగా, నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆమెను ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఎన్డీయే సర్కార్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మంత్రిపదవికి రాజీనామా చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను అంగీకరించలేమని ప్రకటించి, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.