Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డుపై నడుస్తుంటే కార్లోకి లాగారు.. 5 గంటలపాటు అత్యాచారం చేస్తూనే ఉన్నారు

నిర్భయ ఘటనలకు మారుపేరుగా నిలిచిన దేశరాజధాని ప్రాంతంలో మళ్లీ అదే కిరాతక ఘటన జరిగిపోయింది. అయితే ఈసారి బస్సులో కాదు.. కారులో సాముహిక అత్యాచారం జరిగింది. అర్థరాత్రి కాదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్న మహిళను కారులోకి లాగిన మగపశువులు అయిదు గ

Advertiesment
రోడ్డుపై నడుస్తుంటే కార్లోకి లాగారు.. 5 గంటలపాటు అత్యాచారం చేస్తూనే ఉన్నారు
హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (05:25 IST)
నిర్భయ ఘటనలకు మారుపేరుగా నిలిచిన దేశరాజధాని ప్రాంతంలో మళ్లీ అదే కిరాతక ఘటన జరిగిపోయింది. అయితే ఈసారి బస్సులో కాదు.. కారులో సాముహిక అత్యాచారం జరిగింది. అర్థరాత్రి కాదు. రాత్రి 8 గంటల ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్న మహిళను కారులోకి లాగిన మగపశువులు అయిదు గంటలపాటు కారులోనే ఆమెపై అత్యాచారం చే్స్తూ క్రూరాతిక్రూరంగా వ్యవహరించారు. అన్ని గంటలపాటు రోడ్డుమీదే అలా జరుగుతున్నా ఏ ఒక్క గస్తీ కేంద్రం వద్ద పోలీసులు కనిపెట్టలేకపోవడం శాంతి భద్రతల విభాగానికి మాయని మచ్చ.
 
దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు మృగాళ్లు కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాజస్తాన్‌కు చెందిన మహిళ గుర్గావ్‌లోని సోహ్న ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తుండగా ఆమెను దుండగులు స్విఫ్ట్‌ కారులోకి లాగారు. అనంతరం ఐదు గంటలపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ ఢిల్లీ మీదుగా నోయిడా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెను నోయిడాలో వదిలేశారు.
 
నిందితులు అత్యాచారం చేస్తూ కారులో గుర్గావ్‌ నుంచి ఢిల్లీ మీదుగా నోయిడా వరకు వచ్చినా..ఏ ఒక్క పోలీసూ గుర్తించకపోవడం రాజధాని ప్రాంతంలోని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై నోయిడా, గుర్గావ్‌ పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గౌతమ బుద్ధ నగర్‌ ఎస్సెస్పీ లవ్‌ కుమార్‌ చెప్పారు. 2012లో నిర్భయ ఘటన సమయంలో పెద్ద ఉద్యమమే జరిగినా ఎన్‌సీఆర్‌లో మహిళలకు నేటికీ భద్రత కరువైంది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో తరచూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు తీసుకుని ఆడే క్రికెటర్లలో దేశభక్తిని చూస్తున్నారా.. మండిపడ్డ బంగ్లా జట్టు కెప్టెన్ మొర్తజా