Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో దారుణం : మీసం తిప్పాడని ఇంటిమీద పడి చితక్కొట్టారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో దారుణం జరిగింది. మీసం తిప్పాడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది దర్బార్ వర్గీయులు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలు

ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో దారుణం : మీసం తిప్పాడని ఇంటిమీద పడి చితక్కొట్టారు
, శనివారం, 17 డిశెంబరు 2016 (14:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో దారుణం జరిగింది. మీసం తిప్పాడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ దాడికి పాల్పడింది దర్బార్ వర్గీయులు కావడం గమనార్హం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
మెమద్‌పూర్ గ్రామానికి చెందిన మహేష్ పార్మార్‌ అనే యువకుడికి మీసాలు పెంచడమంటే ఇష్టం. అయితే అదే తన కుటుంబంపై దాడికి కారణమవుతుందని అతడు ఊహించలేదు. ఈ నెల 12న అలవాటు ప్రకారం ఓ రోజు రోడ్డుపక్కన హోటల్‌ వద్ద నిలబడి మహేష్ మీసాలు తిప్పుతున్నాడు. అతని ఎదురుగా నిలబడిన దర్బార్ వర్గానికి చెందిన వ్యక్తులు ఇది సహించలేకపోయారు. 
 
కొందరు వ్యక్తులు మహేష్ వద్దకు వెళ్లి... నీది ఏ కులం... నువ్వు మీసాలు ఎందుకు తిప్పుతున్నావని ప్రశ్నించారు. తాను పార్మార్ కులస్తుడనని చెప్పగానే వారు మహేశ్‌ని తిడుతూ కొట్టడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దల సలహా మేరకు తన తమ్ముడు దర్బార్ వర్గీయులతో రాజీ చేసుకున్నాడు. అయినప్పటికీ.. కోపం చల్లారని దర్బార్ వర్గీయులు మహేష్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. తమను వదిలిపెట్టాలని ప్రాధేయపడినా కులం పేరుతో తిడుతూ చితక్కొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజినీకాంత్ 'బాషా' చిత్రాన్ని మా నాన్న చూశారు : కరుణానిధి కుమార్తె కనిమొళి