Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ అసెంబ్లీ పోల్స్ : షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన ఈసీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఈ పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా, డిసెంబర్‌ 9, 1

గుజరాత్ అసెంబ్లీ పోల్స్ : షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన ఈసీ
, బుధవారం, 25 అక్టోబరు 2017 (13:49 IST)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఈ పోలింగ్‌ ప్రక్రియలో భాగంగా, డిసెంబర్‌ 9, 14వ తేదీల్లో ఓటింగ్ నిర్వహించి, 18వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 
 
ఇందుకోసం మొత్తం 50,128 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఏకే జోతి వెల్లడించారు. అలాగే తొలిసారిగా గుజరాత్‌ వ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ పత్రాలున్న ఓటింగ్‌ యంత్రాలతోపాటుగా నియోజకవర్గానికి కనీసం ఒక్కటైనా పూర్తి మహిళా ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈసీ కసరత్తు చేస్తోంది. కాగా, ఆ రాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి వచ్చే యేడాది జనవరి 23వ తేదీతో ముగియనుంది. 
 
అలాగే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయరాదని పేర్కొంది. పోలింగ్ సెంటర్లలో ఈవీఎం, వీవీప్యాట్‌ మెషీన్లు ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు నియోజకవర్గానికి కనీసం ఒక పూర్తి మహిళా ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుజరాత్‌లో బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 
 
షెడ్యూల్ వివరాలు... 
ఎన్నికల తేదీలు: డిసెంబర్‌ 9, 14
కౌంటింగ్: డిసెంబర్‌ 18వ తేదీ
పోలింగ్ సెంటర్లు : 50,128
ఓటర్ల సంఖ్య: 4.33 కోట్లు 
స్థానాలు: 182
నామినేషన్ చివరి తేదీ: నవంబర్ 21

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరి చెట్టుపైనే మూడేళ్ల పాటు సంసారం.. అతడిని ఎలా దించారంటే? (Video)