Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19 ఏళ్ల కుమార్తెపై ఐదేళ్లుగా లైంగికదాడి.. గర్భవతి కావడంతో..

మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మానవత్వం మంటకలిసిపోయింది. వావివరసలు గాల్లో కలిసిపోయాయి. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా పశువులా ప్రవర్తించి కన్నకూతురినే చిదిమేశాడు.. ఓ దుర్మార్గపు తండ్రి. కామపిశా

Advertiesment
Gujarat
, గురువారం, 27 ఏప్రియల్ 2017 (11:09 IST)
మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మానవత్వం మంటకలిసిపోయింది. వావివరసలు గాల్లో కలిసిపోయాయి. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. తాజాగా పశువులా ప్రవర్తించి కన్నకూతురినే చిదిమేశాడు.. ఓ దుర్మార్గపు తండ్రి.

కామపిశాచైన ఆ తండ్రి 19 ఏళ్ల తన కుమార్తెపై ఐదేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భవతి కావడంతో అసలు బండారం బయటపడింది.
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని వడోదరలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ట్రక్‌ డ్రైవరైన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తనకు 14 ఏళ్ల వయసున్నప్పటి నుంచి లైంగికదాడిని ఎదుర్కొంటున్నట్టు ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
 
కూతురుకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భవతి అని తేలడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే.. చంపేస్తానని తండ్రి బెదిరించినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విచారణలో కొట్టకుండా ఉండేందుకు సీఐడీ అధికారులకు రూ.కోటి ఎర...!