Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు కేశవ్ ఇకలేరు

Advertiesment
సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు కేశవ్ ఇకలేరు
, సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:20 IST)
భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మనువడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేశవ్ దేశిరాజు కన్నుమూశారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమార్తె దేశిరాజు శకుంతల కుమారుడే కేశవ్ కావడం గమనార్హం. 
 
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న కేశవ్ సివిల్స్‌లో సత్తాచాటి ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. కేంద్ర ఆరోగ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖల కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత చెన్నై రాయపేటలో ఉంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రపై ఆయన రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ఈయన తండ్రి నరసింహా రావు సైన్యంలో మేజర్‌గా సేవలందించారు. కేశవ్ మృతికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగారక గ్రహం పైకి చిన్ని హెలికాఫ్టర్.. 12వ యాత్ర ప్రారంభం