Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా నియంత్రణకు గూగుల్​ 'లొకేషన్​ డేటా'

కరోనా నియంత్రణకు గూగుల్​ 'లొకేషన్​ డేటా'
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:16 IST)
కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణకు తనమంతు సాయం చేసేందుకు సిద్ధమైంది గూగుల్​. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల లొకేషన్​ డేటాను పబ్లిష్​ చేసేందుకు నిర్ణయించుకుంది.

శుక్రవారం నుంచి ప్రత్యేక వెబ్​సైట్లో ఈ సమాచారం అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల్లోని తమ వినియోగదారుల లొకేషన్​ డేటాను పబ్లిష్​ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ టెక్​ దిగ్గజం​ గూగుల్​.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైబ్​సైట్​లో శుక్రవారం నుంచి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

కరోనా నియంత్రణకు అనుసరించాలని కోరుతున్న సామాజిక దూరం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని సంస్థ బ్లాగ్​లో తెలిపింది గూగుల్​.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి కోసం చర్యలు.. ఏపీ ప్రభుత్వం