Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న పెతోడు విమర్శించడమే... గోవా సీఎం మనోహర్

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కొట్టిపారేశారు. అలాంటి పాడు పని తాను చేయలేదని చెప్పారు. భారతీయులందరి సమక్షంలో తాము బల పరీక్షలో నెగ్గ

Advertiesment
రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న పెతోడు విమర్శించడమే... గోవా సీఎం మనోహర్
, గురువారం, 16 మార్చి 2017 (14:11 IST)
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ కొట్టిపారేశారు. అలాంటి పాడు పని తాను చేయలేదని చెప్పారు. భారతీయులందరి సమక్షంలో తాము బల పరీక్షలో నెగ్గినట్లు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. తమకు 23 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆ విషయాన్నిశాసనసభలో నిరూపించామని తెలిపారు. 
 
గోవా శాసనసభలో జరిగిన బలపరీక్షలో నెగ్గిన అనంతరం పారికర్ మీడియాతో మాట్లాడుతూ... రంగు కళ్ళద్దాలు పెట్టుకున్నవాళ్ళు తమపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు తగినంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమకు అవకాశం ఇవ్వడం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్తున్నారని, అయితే కాంగ్రెస్‌కు మొదటి నుంచి తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేదన్నారు. 
 
దిగ్విజయ్‌ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ ఉన్నందువల్లే భ్రమలు సృష్టించారన్నారు. తన ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వచ్చారని, వారిలో ఒక్కరినైనా హోటల్‌లో ఉంచలేదని, ప్రతిపక్షం మాదిరిగా బహిరంగ ప్రదేశం నుంచి వేరు చేయలేదన్నారు. తమ సర్కారు పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
ఇదిలావుండగా, గురువారం గోవా శాసనసభలో జరిగిన బలపరీక్షలో మనోహర్ పారికర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విజయం సాధించింది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో మనోహర్ పారికర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి 22 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 16 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. మనోహర్ పారికర్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు జీఎఫ్‌పీ, ముగ్గురు ఎంజీపీ, ఒకరు ఎన్‌సీపీ‌ పార్టీలకు చెందిన సభ్యులు ఉండగా, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే సభ నుంచి వాకౌట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనామకుని ఖాతాలో రూ.17 కోట్లు.. బయటపెట్టిన ఐటీ శాఖ