గోవా ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్యంపై ఆందోళనక్కర్లేదు...

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉంది.

సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (15:03 IST)
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడానే ఉంది. 
 
నిజానికి ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందిన మనోహర్ ఈనెల 22వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత అదే రోజున గోవా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో ఆయనను గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే స్పందిస్తూ... ముఖ్యమంత్రి క్షేమంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, దీనిపై ఆందోళన చెందనక్కర్లేదని ఆయన చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వచ్చే ఏడాది ఎన్నికలు.. రైల్వేలో 89,500ల నియామకాలు