Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినుల దుస్తులు తీయించి పాఠశాల మైదానంలో వరుసగా నిలబెట్టి వీడియో తీయించిన ఘటన ఒకటి వెలుగు

దుస్తులు తీయించి.. గ్రౌండ్‌లో నిలబెట్టిన వీడియో తీసిన కీచక హెడ్మాస్టర్
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:02 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కీచక ప్రధానోపాధ్యాయుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థినుల దుస్తులు తీయించి పాఠశాల మైదానంలో వరుసగా నిలబెట్టి వీడియో తీయించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
యూపీలోని సొంభద్ర జిల్లాలో ఎనిమిదో తరగతికి చెందిన కొందరు విద్యార్థినులను సదరు ఉపాధ్యాయుడు బలవంతంగా దుస్తులు తీయించి, స్కూల్ గ్రౌండ్‌లో 2 గంటలపాటు నడిపించాడు. తన మొబైల్ ఫోన్ ద్వారా వారిని వీడియో సైతం తీశాడు. విషయం తల్లిదండ్రుల దృష్టికి వెళ్లడంతో వారంతా మూకుమ్మడిగా వెళ్లి జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో వెంటనే ఆ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ సోంభద్ర డీఎం చంద్ర భూషణ్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సంఘటనపై సంస్థాగతమై విచారణతో పాటు సదరు స్కూలును నడిపిస్తున్న ఓ పవర్ ప్రాజెక్టు జనరల్ మేనేజర్‌పైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. 'ఎక్స్పిరియెన్స్ ఎల్ఎల్ 49' పేరిట అపరిమిత కాల్స్..