భారతీయ జనతా పార్టీకి చెందిన దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఐఎస్ఐఎస్ - కాశ్మీర్ విభాగం ఉగ్రవాదుల నుంచి బెదింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన నివాసానికి భారీ భద్రతను కల్పించారు.
క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత గౌతం గంభీర్ బీజేపీలో చేరి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత గత ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇపుడు బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.
అయితే, ఇటీవలి కాలంలో ఆయన ఘాటైన విమర్శలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఆయన మంగళవారం రాత్రి ఫోన్ చేశారు. అయితే, బెదిరింపులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.