Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాల కోసం గేట్ షెడ్యూల్ రిలీజ్

Advertiesment
ఇంజనీరింగ్ పీజీ ప్రవేశాల కోసం గేట్ షెడ్యూల్ రిలీజ్
, మంగళవారం, 21 డిశెంబరు 2021 (10:24 IST)
జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2022 పరీక్షా షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షను ఈ దఫా ఖరగ్‌పూర్ ఐఐటీ నిర్వహించనుంది. 
 
ఈ పరీక్ష వచ్చే యేడాది ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను జనవరి 3వ తేదీ నుంచి అందజేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఖరగ్‌పూర్ ఐఐటీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
 
ఈ పరీక్ష మొత్తం రెండు సెషన్‌లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. తాజాగా విడుదల చేసిన గ్రేట్ బ్రోచర్ ప్రకారం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి రోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HBDManOfMassesYSJagan : నగరిలో టెన్షన్... టెన్షన్