Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దారుణం... శోభనం గదిలోనే నవ వధువుపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత బలి ఇవ్వాలనీ...

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. హరియాణలో కొత్తగా పెళ్లయి శోభనం గదిలో అడుగుపెట్టిన నవ వధువుపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరం గురించి పరిశీలిస్తే.... హర్యానా కురుక్షేత్రలోని బాబైన్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి ఈ నెల 12న పెళ్లయింది. ఆ మరుసటి

Advertiesment
దారుణం... శోభనం గదిలోనే నవ వధువుపై గ్యాంగ్ రేప్... ఆ తర్వాత బలి ఇవ్వాలనీ...
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (16:09 IST)
మహిళలపై దారుణాలు ఆగడంలేదు. హరియాణలో కొత్తగా పెళ్లయి శోభనం గదిలో అడుగుపెట్టిన నవ వధువుపై మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరం గురించి పరిశీలిస్తే.... హర్యానా కురుక్షేత్రలోని బాబైన్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి ఈ నెల 12న పెళ్లయింది. ఆ మరుసటి రోజు పెళ్లి కుమారుడి ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు. ఐతే వరుడు కుటుంబం పూర్తిగా మూఢ విశ్వాసాలను నమ్మి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేశారు. 
 
శోభనం గదిలోకి వధువు అడుగుపెట్టగానే వరుడు ఆమెకు మత్తుపదార్థం కలిపిన పాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె స్రృహ కోల్పోయింది. వెంటనే ఆమెపై భర్తతో పాటు అతడి తండ్రి, సోదరుడు, సోదరి భర్త, నలుగురు తాంత్రికులు అందరూ వరుసగా అత్యాచారం చేశారు. ఇలా సామూహిక అత్యాచారం ముగియగానే ఆమెను బలి ఇవ్వాలని ప్లాన్ చేశారు. 
 
కానీ ఈలోపుగా ఆమెకు మెళకువ వచ్చి జరిగిన దారుణాన్ని తెలుసుకుంది. ఐతే విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని అంతా బెదిరించారు. కానీ ఆమె జరిగిన దారుణాన్ని తన తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలిసీ తెలియని ప్రేమ.. ప్రాణాల మీదకు తెచ్చింది...