మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50 శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
ఈ క్రమంలో మంగళవారం మహారాష్ట్రలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కరోనాతో ఎనిమిదిమంది మరణించారు. అంబాజ్‌గారు పట్టణంలోని స్మశాన వాటికలో వారి అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు భావించారు.
అయితే ఆ మృతదేహాలు కరోనా బారినపడి మరణించినవారివి కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో స్మశానవాటికకు మృతదేహాలను తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు.