స్నేహం అత్యాచారం చేసేందుకు లైసెన్స్ కాదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్నేహం ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడటంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. స్నేహితురాలిని బంధించి.. ఆమెను లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే తాము ఇష్టపూర్వకంగా సంబంధం కొనసాగించామని ఆరోపిస్తూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్‌ను తిరస్కరించింది.
గతంలో కూడా కోర్టు నాలుగుసార్లు ఇలాంటి అభ్యర్థనను తోసిపుచ్చింది. నిందితుడు, బాధితురాలు స్నేహితులే అయినప్పటికీ.. బాధితురాలిపై పదేపదే రేప్ చేయడం, స్నేహితుడి ఇంట్లో బంధించి కొట్టడానికి స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదని హైకోర్టు పేర్కొంది.