Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు.. ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూత

Advertiesment
Former President
, సోమవారం, 31 ఆగస్టు 2020 (18:09 IST)
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయికే, ఆయన చాలారోజుల పాటు కోమాలో ఉండి, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. 
 
ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు శ్రమపడినా ఫలితం దక్కలేదని, దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు నిర్వహించినా ఫలితం దక్కలేదని తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అభిజిత్ ట్విట్టర్‌లో వెల్లడించారు. 
 
ప్రణబ్ ముఖర్జీ కొన్నివారాల కిందట మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆసుపత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కొన్నిరోజులుగా ఆయన కోమాలోనే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత