Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పరారీలో ఉన్న నిందితురాలు నటి జయప్రద ... అరెస్టు చేయండి.. కోర్టు ఆర్డర్

Advertiesment
jayaprada

వరుణ్

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (08:23 IST)
సినీ సీనియర్ నటి జయప్రద చిక్కుల్లో పడ్డారు. ఆమెను పరారీలో ఉన్న నిందితురాలిగా కోర్టు ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టుకు హాజరుకావడం లేదు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేసినప్పటికీ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్ల ఆమెను అరెస్టు మార్చి ఆరోతేదీలో కోర్టు ప్రవేశపెట్టాలని ఎస్పీని కోర్టు ఆదేశించింది.
 
జయప్రదపై గత 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతున్నాయి. అయితే, ఈ కేసుల విచారణకు హాజరుకావాలని ఆెకు ఇప్పటివరకు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపించారు. కానీ, ఆమె వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిదుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు. పరారీలో ఉన్న జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని, మార్చి ఆరో తేదీ లోపు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. 
 
కాగా, గతంలో జయప్రదే రాజ్యసభ ఎంపీగాను, లోక్‌సభ ఎంపీగాను ఉన్న విషయం తెల్సిందే. అయితే, రాంపూర్ నియోజకవర్గంలో అజం ఖాన్‌తో విభేదాల నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఆ తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి, గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో విక్రయించబడుతోన్న శాంసంగ్ పీసీ లైనప్ గెలాక్సీ బుక్4 సిరీస్