Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ మంత్రి శైలజా టీచర్‌కు ఓపెన్ సొసైటీ ప్రైజ్...

Advertiesment
మాజీ మంత్రి శైలజా టీచర్‌కు ఓపెన్ సొసైటీ ప్రైజ్...
, సోమవారం, 21 జూన్ 2021 (09:24 IST)
కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంతిర కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన విశేష సేవలకుగాను సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌-2021 అవార్డు వరించింది. 
 
సీఈయూ 30వ గ్రాడ్యుయేషన్‌ వేడుకల సందర్భంగా శైలజా టీచర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీఈయూ అధ్యక్షుడు మైకేల్‌ ఇగ్నాటీఫ్‌ తెలిపారు. కరోనా సందర్భంగా శైలజతో పాటు వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారని ఆయన పేర్కొన్నారు. 
 
అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్‌ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతి ఏటా అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్‌ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది. 
 
అయితే.. ఈ పురస్కారం దక్కడంపై కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. కేకే శైలజకు మాత్రం మంత్రివర్గంలో చోటుదక్కలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాపడలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాలకు ప్రారంభమైన టీఎస్ఆర్టీసీ