Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడు దశాబ్దాల నిస్వార్థ సేవలో 'ఏకల్ విద్యాలయ'.. యూ ట్యూబ్‌లో థీమ్ సాంగ్(Video)

ఏకల్ విద్యాలయా ఫౌండేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ విద్యాలయం గురించి ఎవరిని అడిగినా చెపుతారు. దేశంలో ఉన్న ఏకైక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. గ్రామీణ భారతావనిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న సంస్థ. గ్రామీణ వాసుల్లో సామాజిక పరిస్థ

మూడు దశాబ్దాల నిస్వార్థ సేవలో 'ఏకల్ విద్యాలయ'.. యూ ట్యూబ్‌లో థీమ్ సాంగ్(Video)
, మంగళవారం, 8 నవంబరు 2016 (19:29 IST)
కేవలం 5 నిమిషాల్లో ఓ నమ్మకం, ఓ ఆశ... ధైర్యం... కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లోనే. ఇది ఏకల్ విద్యాలయతోనే సాధ్యం.

ఏకల్ విద్యాలయా ఫౌండేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ విద్యాలయం గురించి ఎవరిని అడిగినా చెపుతారు. దేశంలో ఉన్న ఏకైక నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. గ్రామీణ భారతావనిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న సంస్థ. గ్రామీణ వాసుల్లో సామాజిక పరిస్థితులపై అవగాహన పెంచేందుకు అట్టడుగు స్థాయి నుంచి పని చేస్తోంది. 'ఏక్ శిక్షాక్.. ఏక్ విద్యాలయ' (ప్రతి పాఠశాలకు ఓ ఉపాధ్యాయుడు) అనే నినాదంతో పని చేస్తోంది. ఈ సంస్థ గ్రామీణ భారతావని దాదాపు 51 వేల పాఠశాలలను నడుపుతోంది. గ్రామీణ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతూ.. వారి జీవితాల్లో  విద్యాకాంతులను నింపుతోంది. ఈ సంస్థ ఇటీవల థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించింది. 
 
ఈ పాటను నవంబరు 1వ తేదీన యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. గ్రామీణ భారతావనిలో ఈ సంస్థ చేస్తున్న పనితీరును ఈ పాట స్పష్టంగా కళ్ళకు కడుతుంది. ఈ పాటలో ఏకల్ థీమ్‌తో సాగుతుంది. ఈ వీడియోను చూస్తే ఏ పేపరో లేదంటే ఏ రిపోర్టో అవసరం లేదు. ఏకల్ థీమ్ సాంగ్‌లో గ్రామీణ భారతం గురించి అంత స్పష్టంగా ఉంది మరి. ఇందులో ఉన్న ఏకల్ అంటే ఏక్ కల్.. అంటే సింగిల్ అలాగే, రేపటి కోసం... అనే అర్థం వచ్చేలా ఉంటుంది. ఇకపోతే.. ఈ సంస్థ 1986లో స్థాపితమైంది. గత మూడు దశాబ్దాలుగా నిస్వార్థ సేవలో ఈ సంస్థ మరింతగా దృఢంగా ముందుకు సాగుతోంది. ఐదు నిమిషాల పాటు సాగే పాటలో ఎంతో ఆశతో పాటు.. ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
ఈ పాటను సునయన కచ్రూ రాయగా సంగీతాన్ని ప్రసన్న అందించారు. అనురాధ పాలకుర్తి, హరిహరన్ ఈ గీతాన్ని ఆలపించారు. మరో విశేషం ఏమిటంటే అనురాధ ఈ వీడియోకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావడం. ఈ వీడియోకు సంజీవ్ శర్మ డైరెక్టర్. రాజేంద్ర భాటియా అసోసియేట్ డైరెక్టర్. కెమేరా రాజేంద్ర సింగ్. కాగా ఈ వీడియోను కేంద్ర మానవ వనరుల మంత్రి విడుదల చేశారు. చూడండి ఈ వీడియోను...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దె రూపాయి... హంగులకు రూ.10 కోట్లు... ఏపీలో ఇదీ దుబారా