Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జపాన్‌లో జోకులేస్తూ నవ్వారు.. గోవాలో మొసలి కన్నీరు కార్చారు.. మోడీపై రాహుల్ సెటైర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. జపాన్‌లో జోకులు వేసిన మోడీ.. గోవాలో మొసలి కన్నీరు కార్చారంటూ విమర్శించారు. మోడీ ఇప్పటికి వాస్తవ ప్రపంచంలోకి వచ్చ

Advertiesment
First Laughter
, సోమవారం, 14 నవంబరు 2016 (12:48 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. జపాన్‌లో జోకులు వేసిన మోడీ.. గోవాలో మొసలి కన్నీరు కార్చారంటూ విమర్శించారు. మోడీ ఇప్పటికి వాస్తవ ప్రపంచంలోకి వచ్చారన్నారు. ప్రజల కష్టాలను తలచుకొని ప్రధాని భావోద్వేగానికి గురవడంపై రాహుల్‌ ట్విటర్‌ కామెంట్ల ద్వారా స్పందించారు.
 
ఈ ట్వీట్‌లో "మొదట నవ్వులు. ఇప్పుడు కన్నీళ్లు. అజ్ఞానం వాస్తవంలోకి వచ్చింది" అన్నారు. మోడీ జపాన్‌లో జోకులు వేయడాన్ని ప్రస్తావిస్తూ అంతకుముందు ట్వీట్‌లో "పేదలు ఏడుస్తుంటే మోడీ నవ్వుతున్నారు" అని వ్యాఖ్యానించారు. "ప్రధాని నాటకీయతను ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు" అంటూ మండిపడ్డారు. 
 
దేశంలో నగదు చేతిలో ఉన్న వాళ్లందర్నీ ప్రధాని నల్లధనం బాపతు కింద జమకట్టారని విమర్శించారు. ప్రధాని పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారంటూ బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. తన నిర్ణయం వల్ల కష్టాలు పడుతున్న ప్రజలను తిరిగి ఆయనే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో 2 వారాలు నోట్ల కష్టాలు తప్పవ్... మార్కెట్‌లోకి రూ.500 కొత్త నోట్లు