Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెల్లెళ్లను విద్యార్థితో ఏకాంతంగా గడపమని వీడియో తీశాడు.. ఆపై కారు కొన్నాడు?

డబ్బు అడ్డదారిన సంపాదించాలనుకున్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డబ్బుకు క‌క్రుర్తి పడి సొంత చెల్లెళ్లను పావుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఓ ట్యూటర్‌ సొంత చెల్లెళ్లను డబ్బు కోసం నగల వర్తకుని కుమారుడి వద్

Advertiesment
చెల్లెళ్లను విద్యార్థితో ఏకాంతంగా గడపమని వీడియో తీశాడు.. ఆపై కారు కొన్నాడు?
, బుధవారం, 23 ఆగస్టు 2017 (12:04 IST)
డబ్బు అడ్డదారిన సంపాదించాలనుకున్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డబ్బుకు క‌క్రుర్తి పడి సొంత చెల్లెళ్లను పావుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో ఓ ట్యూటర్‌ సొంత చెల్లెళ్లను డబ్బు కోసం నగల వర్తకుని కుమారుడి వద్దకు పంపాడు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఆగ్రా నగరంలోని ఓ ట్యూషన్ సెంటరులో చదువుకునేందుకు నగల వర్తకుడి కుమారుడు వస్తున్నాడు. బాగా డబ్బున్న తన విద్యార్థిని ట్యూటర్ ఉపయోగించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఇద్దరు చెల్లెళ్లను అతని వద్దకు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ముగ్గురు ఏకాంతంగా ఉండగా దాన్ని వీడియో తీశాడు.  
 
ఇంకా విద్యార్థినిని బెదిరించాడు. తన చెల్లెళ్లతో జరిపిన సెక్స్ వీడియోను బయటపెడతానంటూ బెదిరిస్తూ ట్యూటర్ నగల వర్తకుడి కుమారుడి నుంచి మద్యం, నగదు, మొబైల్ ఫోన్లు, నగలు ఇవ్వాలని డిమాండు చేశాడు. బ్లాక్ మెయిల్ చేసి పొందిన డబ్బుతో కారు వంటి ఇతరత్రా ఎలక్ట్రానిక్ పరికరాలు కొన్నాడు. దీంతో నగల వర్తకుడి కుమారుడు ట్యూటర్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ అమ్మమ్మకు చెప్పేయడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. 
 
నగల వర్తకుడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి విద్యార్థి నుంచి తీసుకున్న డబ్బుతో కొన్న కారు, ఏసీ, ఫ్రిజ్, సోఫాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న చెల్లెళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొమ్మిది నెలల పాటు ట్యూటర్‌తో పాటు అతని చెల్లెళ్లు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. తన వద్ద అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను నెట్లో పెడతానని బెదిరించారని పోలీసులతో బాధితుడు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే నెలలో రూ.200 నోటు.. ఆతర్వాత రూ.50 నోటు