ఫ్రెండ్ కోసం తల్లిదండ్రుల ప్రైవేట్ వీడియో తీసిన కుర్రోడు... కోటి డిమాండ్
ఓ 13 యేళ్ళ కుర్రోడు తెలిసి చేసిన తప్పుకు ఇపుడు అతని కుటుంబం పరువుపోయింది. తన తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసిన కుమారుడు.. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు పంపించాడు. ఆ వీడియోను చూసిన ఫ
ఓ 13 యేళ్ళ కుర్రోడు తెలిసి చేసిన తప్పుకు ఇపుడు అతని కుటుంబం పరువుపోయింది. తన తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసిన కుమారుడు.. ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు పంపించాడు. ఆ వీడియోను చూసిన ఫేస్‌బుక్ ఫ్రెండ్.. ఇపుడు ఆ వీడియో లీక్ చేయకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... కర్నాటక రాష్ట్రంలోని హీరోహళ్లి - ఆంధ్రాహళ్లి రోడ్‌లో బాధిత కుటుంబం నివసిస్తోంది. వారి 13 ఏళ్ల కుమారుడు గతేడాది జూన్‌లో ఫేస్‌బుక్‌లో ఖాతా ఓపెన్ చేశాడు. తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని ఓకే చేశాడు. ఏప్రిల్ 2017 చివరిలో తేజల్ పటేల్, చిన్నారికి అభ్యంతరకర చిత్రాలు పంపడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు పంపిస్తూ అతన్ని తన ముగ్గులోకి దించాడు.
అలాగే, బాలుడితో అసభ్యకరంగా చాట్ చేయడంతోపాటు అతడి న్యూడ్ ఫొటోలు పంపేవాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల న్యూడ్ ఫొటోలు పంపాల్సిందిగా బాలుడిని కోరాడు. అతడి కోరిక మేరకు తల్లిదండ్రులు ప్రైవేటుగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు. వాటిని అందుకున్న వెంటనే తేజల్ బ్లాక్ మెయిలర్‌గా మారిపోయాడు.
తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోను అడల్ట్ వెబ్‌సైట్‌లలో పెడతానని బాలుడిని బెదిరించాడు. దీంతో భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని తేజల్ పటేల్‌గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.