కుమారుడిని చంపేసినా దోషులను వదిలిపెట్టేయమన్న తండ్రి.. వారు కూడా..?
తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును విజ్ఞప్తి చేసుకున్నాడు. తన బిడ్డ ఎలాగో ఇక తిరిగిరాలేడు.. నిందితులు దోషులని తేలినప్పటికీ వారు కూడా తన కొడుకుల్లాంటి
తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును విజ్ఞప్తి చేసుకున్నాడు. తన బిడ్డ ఎలాగో ఇక తిరిగిరాలేడు.. నిందితులు దోషులని తేలినప్పటికీ వారు కూడా తన కొడుకుల్లాంటి వారేనని.. వారిని విడిచిపెట్టేయాలని ఓ తండ్రి క్షమాగుణాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో రాహుల్, సంజీవ్, దీపక్, రాజాలు గ్రామ సేవ వాహనాల డ్రైవర్లు. పార్కింగ్ గొడవ కారణంగా గత ఏప్రిల్ 28, 2012లో సన్నీ అనే మరో డ్రైవర్‌తో గొడవకు దిగారు. ఈ గొడవ కాస్త దాడికి దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదనలు కోర్టులో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దోషులు నలుగురు హత్యకు గురైన యువకుడి తండ్రిని క్షమాపణలు వేడుకున్నారు. అతడు కూడా క్షమించాడని కోర్టు పేర్కొంది. దోషులను వదిలిపెట్టేయాలని మృతుడి తండ్రి చేసిన అభ్యర్థనను మన్నించిన కోర్టు ప్రోబేషన్‌పై నలుగురు దోషులను వదిలిపెట్టింది. వారికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండగా అతడి క్షమాభిక్షతో బయటపడ్డారు.