Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్ ప్రేమ.. కులాంతర వివాహం.. ఆత్మహత్య చేసుకుందామని.. ప్రేయసిపై డీజిల్ కుమ్మరించి?

ఫేస్‌బుక్ ప్రేమతో ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు ఆమెతో కాపురం చేశాడు. అయితే ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. కానీ దొరికిపోయాడు. వివరాల్

Advertiesment
ఫేస్‌బుక్ ప్రేమ.. కులాంతర వివాహం.. ఆత్మహత్య చేసుకుందామని.. ప్రేయసిపై డీజిల్ కుమ్మరించి?
, బుధవారం, 5 జులై 2017 (09:12 IST)
ఫేస్‌బుక్ ప్రేమతో ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు ఆమెతో కాపురం చేశాడు. అయితే ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. కానీ దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొలత్తూరుకు చెందిన శక్తి (23) అనే యువతికి సేలంకు చెందిన మురళి అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. 
 
గత నెల 28న చెన్నై తాంబరంకు వచ్చిన మురళి.. శక్తికి ఫోన్‌ చేసి పిలిపించుకుని కారులో తంజావూరుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత పన్రుట్టి వద్ద పెళ్లి చేసుకున్నాడు. వారం పాటు ఆమెతో గడిపిన మురళి ఉన్నట్టుండి తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించరని.. కులాంతర వివాహం చేసుకున్న తమను విడగొడతారని నమ్మించాడు. మనం విడిపోవడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదన్నాడు. మురళి మాటలను నమ్మిన శక్తి.. ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైంది. మురళీ శక్తిని పన్రుట్టిలోని జీడి మామిడి తోట వద్దకు తీసుకెళ్లి ఆమెపై డీజిల్‌ కుమ్మరించి నిప్పంటించాడు. 
 
తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. మంటల్లో అరవైశాతానికి పైగా గాయాలపాలైన శక్తిని ఆ మార్గంలో వెళుతున్న అంబులెన్స్‌ డ్రైవర్‌ చూసి ఆమెను పన్రుట్టి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శక్తి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. పరారీలో ఉన్న మురళి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసహజ బంధం.. ఇద్దరు పిల్లలకు తల్లిని దూరం చేసింది... ఎలా?