ఫేస్‌బుక్ ఫ్రెండ్.. పెళ్లికి నిరాకరించిందనీ పొడిచి గాయపరిచాడు...
ఫేస్‌బుక్ పుణ్యమాన్ని ముక్కూమొహం తెలియని వాళ్లు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. అదేసమయంలో నేరాలు ఘోరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించిందని ఆమెను పొడిచి గాయపరిచిన ఘ
ఫేస్‌బుక్ పుణ్యమాన్ని ముక్కూమొహం తెలియని వాళ్లు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు. అదేసమయంలో నేరాలు ఘోరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ ఫ్రెండ్ పెళ్లికి నిరాకరించిందని ఆమెను పొడిచి గాయపరిచిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
కనగలక్ష్మి అనే యువతి కోవై భారతీయర్ యూనివర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. సంవత్సరం క్రితం ఆమెకు చెన్నైలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేసే వెంబురాజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దీన్ని ఆమె యాక్సెప్ట్ చేసింది. అప్పటినుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వచ్చారు.
అయితే, ఆమెను మొట్టమొదటిసారి కలవడానికి బుధవారం భారతీయర్ యూనివర్సిటీకి వెంబురాజ్ వచ్చాడు. అక్కడే ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ బాటిల్‌తో పొడిచి గాయపరిచాడు. పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు.