భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దీనిపై నావెల్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేశారు. ఇది నౌకాదళ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా చెబుతున్నారు.
ఈ లైట్ కంపాడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థ డీఆర్‌డీవో తయారుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానాన్ని.. విక్రమాదిత్యపై ల్యాండింగ్ చేయడం ఇదే తొలిసారి. ఈ తరహా ఫైటర్ విమానాలను అభివృద్ధి చేసేందుకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తీవ్రంగా కృషి చేస్తోంది.
గోవాలోని షోర్ బేస్డ్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్‌లో ఈ పరీక్ష కొనసాగింది. విక్రమాదిత్యపై ల్యాండ్ అయ్యేందుకు పైలట్లు కొన్ని వంద గంటల పాటు ట్రైనింగ్ చేశారు. ఈ విషయాన్ని రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.